PDPL: పెద్దపల్లి రూరల్ మండలంలోని హనుమంతునిపేట మీదుగా ముత్తారం వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఎస్సారెస్పీ కాలువ ఎల్-1 వద్ద మూలమలుపులో ఉండడం.. ఆ కాలువకు సైడ్ వాల్ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. కొద్దిరోజుల క్రితం ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. కాలువకు ఇరువైపులా సైడ్ వాల్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.