NZB: సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామ సమీపంలోని వంతెన వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంత ఏర్పడింది. భారీ వర్షాల వల్ల వర్షపు నీరు రోడ్డుపై నుంచి ప్రవహించి గుంత ఏర్పడింది. దీంతో ఆ రహదారిలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని స్థానికులు కోరారు.