VSP: AU లో బీఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలలో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ (పరీక్షలు) ఎం.పద్మరాజు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 13 నుంచి జరగనున్న బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను AU వెబ్సైట్లో పొందుపరిచారు.