వస్తు, సేవల పన్ను(GST) సంఖ్యను తీసుకున్నా.. పన్ను చెల్లించని 18వేలకుపైగా బోగస్ కంపెనీలను అధికారులు గుర్తించారు. నకిలీ కంపెనీలను గుర్తించేందుకు GST అధికారులు దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో రూ.73వేల నకిలీ GSTలను గుర్తించారు. అందులో 18 వేలకుపైగా సంస్థలు ఉనికిలో లేనివే. ఈ ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా కంపెనీలు రూ.70 కోట్ల వరకు స్వచ్ఛందంగా GST చెల్లించినట్లు అధికారులు తెలిపారు.