న్యూయార్క్‌కు చెందిన అమీ లాండినో అనే మహిళ రోజుకు 4 గంటలే పని చేస్తూ.. నెలకు రూ. 15 లక్షలు సంపాదిస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాను లాభదాయకమైన వ్యాపార క్షేత్రంగా మలుచుకోవడంలో విజయం సాధించింది. మొదట్లో వీడియోలను యూట్యూబ్‌లో షేర్ చేస్తూ.. తనలోని స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునేది. తర్వాత తన ‘అమీ టీవీ’లో ఓ ఆన్ లైన్ కోర్సును ప్రారంభించింది. ఇదే ఆమెకు టర్నింగ్ పాయింట్.