చలికాలంలో పెదాలు పొడిగా మారి పగిలి ఇబ్బంది పెడుతుంటాయి. లిప్‌బామ్, వాసెలిన్ వాడినా ఒక్కోసారి ఫలితం ఉండదు. దీనికి కారణం శీతాకాలంలో నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలోని తేమశాతం తగ్గి పెదాలు పొడిబారుతాయి. పొడిబారిన పెదాలు తరుచూ నాలుకతో తడపకూడదు. అలా చేయడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. ఒక స్పూన్ చక్కెర, తేనె కలిపి పెదాలపై రుద్దాలి. దీంతో పెదాలకు రక్తప్రసరణ జరిగి పగుళ్లు తగ్గి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.