SKLM: శ్రీకాకుళం నగరం విశాఖ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల యొక్క క్షేత్రస్థాయి సమస్యల గురించి వినతులు స్వీకరించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి.. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.