ప్రకాశం: మండల కేంద్రమైన మర్రిపూడిలో బీసీ బాలుర వసతి గృహం మంజూరు చేస్తూ కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు బుధవారం జారి చేశారు. రాష్ట్ర మంత్రి, స్థానిక శాసనసభ్యుడు అయిన డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చొరవతో ప్రభుత్వం హాస్టల్‌ను మంజూరు చేశారు. ఈ సందర్భంగా మర్రిపూడి మండల ప్రజలు మంత్రి స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.