BHPL: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని భూపాలపల్లి మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ ముంజాల రవీందర్ గౌడ్, నిర్మల దంపతులు అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు లక్ష్మి నగర్‌కు చెందిన రాపర్తి మల్లమ్మకు రూ.19 వేలు, హనుమాన్ నగర్‌కు చెందిన కొండపాక శంకరాచారికి రూ.16 వేల చెక్కులను కౌన్సిలర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.