అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజాకృష్ణమూర్తి గెలుపొందారు. ఇల్లినోయీ రాష్ట్రాన్ని డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ సొంతం చేసుకోగా.. ఇక్కడి ఎనిమిదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రాజా కృష్ణమూర్తి విజయం సాధించారు. ప్రస్తుతానికి కమలా హారిస్ 99 ఎలక్టోరల్ సీట్లు కైవసం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ 188 ఎలక్టోరల్ సీట్లు గెలిచి ముందంజలో ఉన్నారు.