TG: రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో భారీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. 2,400 మెగావాట్ల సామర్థ్యంతో రూ.29,345 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ఎన్టీపీసీ బోర్డు ఆమోదం తెలిపింది. 800 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు తప్పుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.