KNL: తమ సమస్యలను పరిష్కరించాలని గూడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మెడికల్ ఆఫీసర్ ప్రత్యూషకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జే.మోహన్, ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకురాలు శేషమ్మ మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేయాలన్నారు. ఈనెల 18న కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలన్నారు.