సూర్యాపేట: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. శుక్రవారం మోతే మండల పరిధిలోని రావి పహాడ్ గ్రామంలో సీపీఎం పార్టీ గ్రామ శాఖ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.