పాల్వంచ మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పిల్లలకు అన్నప్రాసన, తలనీలాలు సమర్పించి తమను చల్లంగ చూడమని వేడుకున్నారు. సత్రాలు నిండిపోవడంతో భక్తులు చెట్లకింద వంటావార్పు చేపట్టారు.