KMM: పాలేరు జలాశయానికి సాగర్ జలాలు చేరాయి. ఎగువన కాగితపు రామచంద్రాపురం 132 కిలోమీటర్లు వద్ద సాగర్ ఎడమ కాలువకు గండిపడిన విషయం తెలిసిందే. గండి మరమ్మతులు పూర్తి కావడంతో పాలేరు జలాశయానికి సాగర్ జలాలు విడుదల చేయగా, శుక్రవారం ఉదయం చేరుకున్నాయి. ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు నీటిపారుదల శాఖ డీఈ మధు తెలిపారు.