MNCL: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిపై నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు తుది దశకు వచ్చాయన్నారు. 100%పూర్తి చేసిన పాఠశాలల బిల్లులు సమర్పిస్తే మంజూరు చేస్తామన్నారు.