KMM: కార్మిక చట్టాల స్థానంలో కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమవారం మధిర ఆర్టీసీ డిపోకి చెందిన సిబ్బంది, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పద్మావతి, కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.