KMR: తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి రావు చెప్పారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి రావును శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.