WGL: చేర్యాల మండలం అయినాపూర్ గ్రామంలోని తాళ్లకుంట చెరువును ఇరిగేషన్ డిఈ శ్యామ్, ఏఈ శశిధర్రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు ఆక్రమణకు గురైందని పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం నుంచి పూర్తి సర్వే ప్రారంభిస్తామని తెలిపారు. ఎస్టీఎల్ పరిధిలో ఉన్న భూమి మొత్తానికి హద్దులు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అప్పగిస్తామన్నారు.