SRCL : పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరుతూ తాజా మాజీ సర్పంచుల జేఏసీ ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపుమేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని తాజా మాజీ సర్పంచ్లను ఈరోజు ఉదయం ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఉద్యమిస్తున్న తమను అరెస్టు చేయడం దారుణమని అన్నారు.