NLG: చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద అర్ధరాత్రి జాతీయ రహదారి 65పై హైదరాబాద్ వెళ్లే దారిలో కారులో మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ అప్రమత్తమై దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అయ్యింది. స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోపు కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్కిట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు.