BDK: ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురజాడ అప్పారావు 162వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ హవీల మాట్లాడుతూ.. సంఘసంస్కరణోద్యం, మహిళా అభ్యుదయం కోసం గురజాడ వారు ఎంతో కృషి చేశారని కొనియాడారు. తెలుగు శాఖ ఇంఛార్జ్ డాక్టర్ రాంబాబు హిస్టరీ అధ్యాపకుడు డాక్టర్ కిరణ్ కుమార్, తెలుగు అధ్యాపకులు, జాయ్ కిరణ్ వీరన్న, పాల్గొన్నారు.