భద్రాద్రి: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సోమవారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజ్ కుమార్తో కలిసి గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. పినపాక మండలం భూపతిరావు పేట గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.