NLG: జిల్లా మున్సిపాలిటీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వివిధ రకాల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి, అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాలలో మంగళవారం మున్సిపల్ కార్మికులతో కలిసి చిట్యాల మున్సిపల్ కమిషనర్ వీరేంద్రకు వినతిపత్రం అందజేశారు.