NZB: పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని అర్బన్ MLA ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. తపస్ ఆధ్వర్యంలో మంగళవారం పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల 4 డీఏలు, ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. అలాగే పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.