KMR: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 26న కామారెడ్డి ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి బీ.పీ. మధుసూదన్‌రావు తెలిపారు. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు.