WGL: కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని సీపీఎం పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేషన్ కార్డులు ఇస్తానని హామీ ఇస్తుంది తప్ప, ఏ ఒక కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.