ADB: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ వాహనాన్ని మహారాష్ట్ర పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికలో ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని పర్భని నియోజకవర్గ సమన్వయ కార్యకర్తగా వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సమయంలో పోలీసులకు అడే గజేందర్ సహకరించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.