VKB: అనంత పద్మనాభ స్వామి కటాక్షంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ:సంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆలంపల్లి ఆలయంలో నవరాత్రి వేడుకల్లో భాగంగా అనంత పద్మనాభస్వామిని పురవీధుల్లో హంస వాహనంపై ఊరేగించారు. ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొని పల్లకి సేవ నిర్వహించారు.