NRML: జిల్లాలోని కడ్తాల్ గ్రామం వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అదిలాబాదు నుండి హైదరాబాద్ లోడ్‌తో వెళుతున్న లారీ తెల్లవారుజామున జాతీయ రహదారి పై నుండి పంట పొలాలలో దూసుకు వెళ్లి బోల్తా పడినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.