ఖమ్మం: నగరంలో మున్నేరుకు రెండువైపులా చేపట్టిన రక్షణ గోడల నిర్మాణంపై నిపుణుల సూచనలు పాటిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరో వందేళ్ల పాటు ఎంత వరద వచ్చినా ఇబ్బందులు కలగకుండా నిర్మాణం చేపడతామని తెలిపారు. త్వరలోనే నిపుణుల కమిటీ మున్నేరును పరిశీలించి రక్షణ గోడలు ఎలా నిర్మించాలి ఎంత పొడవు ఉండాలనే అంశాలపై అధ్యయనం చెప్పారు.