NRML: పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం సూచించారు. ఖానాపూర్ పట్టణంలోని జెకె నగర్ కాలనీలో ఉన్న మహాత్మ జ్యోతి బాపులే గర్ల్స్ పాఠశాలలో సోమవారం మున్సిపల్ తరఫున నిర్వహించిన స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.