GDWL: దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో దళిత జర్నలిస్టుల చైతన్య సభ కరపత్రాలను జర్నలిస్టులతో కలిసి విడుదల చేశారు. ఈనెల 27న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే చైతన్య సభకు దళిత జర్నలిస్టులు తప్పక హాజరుకావాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాశ పోగు జాన్ పేర్కొన్నారు.