KNR: కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పెర తిరుమల్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన తిరుమల్ రెడ్డి పార్ధీవదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.