WGL: నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మండలాల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, సూపర్వైజర్లకు జిల్లా కలెక్టర్ సత్య శారద కులగణనపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కులగణన నిబద్ధతతో కచ్చితంగా నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు జిల్లా కలెక్టర్ సంధ్యా రాణి, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.