NRPT: జిల్లాలోని కేజీబీవీలలో ఖాళీగా ఉన్న ఎస్వోలు, సీఆర్టీలు, పీజీ సీఆర్టీ, పీఈటీ పోస్టులకు గత సంవత్సరంలో నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులతో భర్తీ చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘనీ బుధవారం పేర్కొన్నారు. ఈ నెల 27న జిల్లా కేంద్రంలో కేజీబీవీ పోస్ట్ లకు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.