మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ యూజర్లకు శుభవార్త చెప్పింది. తమ వినియోగదారులకు(Users) ఫ్రెండ్లీ మెసేజింగ్ అందించేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగా చాట్ లాక్ ఫీచర్ నుంచి ఇప్పుడు చాట్ ట్రాన్స్ఫర్ వరకూ కొత్తగా ఫీచర్లను అందించింది. అవన్నీ యూజర్లకు ఎంతగానో నచ్చాయి. తాజాగా ఈ యాప్ మరో సరికొత్త ఫీచర్‌ను (Features) యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పుడు ఒకే వాట్సాప్ యాప్(WhatsApp)లో వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను ఉపయోగించొచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్(Facebook)లో అకౌంట్ మారడాన్ని మెటా ఎలా అనుమతిస్తుందో అదే తరహాలో వేర్వేరు వాట్సాప్ అకౌంట్లను ఒకే యాప్‌లో వినియోగించుకోవచ్చు. వాట్సాప్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో ఒకే వాట్సాప్‌లో వేర్వేరు అకౌంట్లను యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ కొంతమందికే అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
ఈ ఫీచర్‌ను ఎలా వినియోగించాలంటే..ముందుగా వాట్సాప్ అకౌంట్లో క్యూఆర్ కోడ్(QR code) ఆప్షన్ వద్దకు వెళ్లాలి. అక్కడ బాణం సింబల్’తో మరో అకౌంట్‌ను యాడ్ చేసుకోవాలి. వేేరే ఖాతాను అక్కడ వినియోగించుకోవచ్చు. ఈ విధంగా ఒక అకౌంట్లో పర్సనల్ చాట్స్, మరో అకౌంట్లో ప్రొఫెషనల్ చాటింగులు చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే దీనిని పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.