ఈరోజు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పుట్టిన రోజు. 2003లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పఠాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడి పలు రికార్డులను నెలకొల్పారు. ఒకే టెస్టులో హ్యాట్రిక్ తీసి, సెంచరీ చేసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డుకెక్కారు. భారత్ గెలిచిన T20 WC-2007 టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. అలాగే పాకిస్థాన్‌పై టెస్టులో మొదటి 3 బంతులకే 3 వికెట్లు తీయడం మర్చిపోలేనిది.