న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో అద్భుత సెంచరీతో మెరిసిన నయా స్టార్ సర్ఫరాజ్ ఖాన్‌పై మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. బౌలర్లపై ఒత్తిడి ఎలా తీసుకురావాలో అతనికి బాగా తెలుసు. అందుకే స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. పేసర్లను నిలకడగా ఆడాడని కొనియాడాడు. అతను క్రీజు నుంచి ఎక్కువగా కదలకుండా గేమ్ ప్లాన్ చేస్తాడని అన్నాడు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 150 పరుగులు చేశాడు.