న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. అతడి ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలు కురిపించారు. ‘సర్ఫరాజ్ న్యూజిలాండ్‌తో ఆడిన విధానం అద్భుతంగా ఉంది. అతడు న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు అమోఘం. ప్రస్తుతం అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతడిని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసి ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకెళ్లాలి’ అని తెలిపారు.