కోహ్లీని RCB భారీ మొత్తం వెచ్చించి రిటైన్ చేసుకుంది. గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్న డుప్లెసిస్‌ను తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విరాట్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. దీనిపై స్పందించిన RCB డైరెక్టర్.. ‘అలాంటివారిని కాస్త నిరుత్సాహానికి గురి చేశాం. అందుకోసం క్షమాపణలు చెబుతున్నాం. కెప్టెన్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఆ ఆప్షన్‌ను అంతా ఓపెన్‌గా ఉంచాం’ అని అన్నారు.