SRCL: చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శుక్రవారం గ్రామ కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు, వివిధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఈ చెక్కులను పంపిణీ చేశారు. గ్రామంలో ఐదుగురికి 2,74,500 వేల రూపాయల చెక్కులను కిషన్ సెల్ మండల అధ్యక్షులు బాణాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాధితులకు అందజేశారు.