యువ క్రికెటర్లు రచిన్ రవీంద్ర, సర్ఫరాజ్ ఖాన్‌పై సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘కివీస్ క్రికెటర్ రచిన్ రవీంద్రకు బెంగళూరుతో ప్రత్యేక అనుంబంధం ఉంది. అతడి కుంటుంబం బెంగళూరు నుంచి న్యూజిలాండ్‌కు వలస వెళ్లింది. అతడు అక్కడే సెంచరీ చేశాడు. ఇక సర్ఫరాజ్ జట్టుకు అత్యవసరమైన వేళ తన కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు యువకులు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలరు’ అంటూ ట్వీట్ చేశారు.