ప్రోకబడ్డీ లీగ్ 11వ సీజన్లో వరుసగా 4 మ్యాచుల్లో ఓడిన బెంగళూర్ బుల్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీపై 34-32తో పైచేయి సాధించి, 2 పాయింట్ల తేడాతో ఉత్కంఠ విజయం నమోదు చేసింది. దబంగ్ ఢిల్లీకి ఇది 5 మ్యాచుల్లో రెండో ఓటమి కాగా, బెంగళూర్ బుల్స్‌కు ఇది 5 మ్యాచుల్లో తొలి విజయం కావడం గమనార్హం.