ఢిల్లీ మేనేజ్మెంట్తో రిషబ్ పంత్‌కు విభేదాలున్నాయని వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఇది పలు ఆంగ్ల వార్తా ఛానళ్లలో చక్కర్లు కొడుతోంది. పంత్‌కు బదులు అక్షర్ పటేల్‌ను సారథిగా చేసే ఆలోచనలో ఢిల్లీ కో-ఓనర్ జీఎంఆర్ ఉన్నాడట. అందుకే, పంత్ ఢిల్లీని వీడి వచ్చేసినట్లు కథనాలు పేర్కొన్నాయి.