మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టిస్తుంది. వెస్టిండీస్‌ను ఓడించి న్యూజిలాండ్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగు పెట్టగా, దక్షిణాఫ్రికా వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది.