ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా తెలుగు టైటాన్స్-దబాంగ్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో 37-41 పాయింట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. ఢిల్లీ జట్టులో రైడర్లు నవీన్ కుమార్, అశు మాలిక్ 15 పాయింట్లు సాధించారు. తెలుగు టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ అత్యధికంగా 18 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు.