న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘మొదటి ఇన్నింగ్స్లో 46 పరుగులకు ఆలౌట్ అవుతామని ఊహించలేదు. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఓటమి నుంచి మేం కోలుకుని ముందుకెళ్తాం. గతంలో ENGతో కూడా ఓ మ్యాచ్ ఓడిపోయి తర్వాత వరుసగా 4 గెలిచాం’ అని పేర్కొన్నాడు. పంత్, సర్ఫరాజ్లు అద్భుతంగా ఆడారని.. వారి బ్యాటింగ్లో పరిపక్వత కనిపించిందని కొనియాడాడు.