If it takes 40 balls to open the account.. Maxwell scored a century
ఇటీవల వరుసగా ఫెయిల్ అవుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ (kolkata knight riders) బ్యాట్సుమెన్ మన్ దీప్ సింగ్ మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అసంతృప్తి వ్యక్తం చేశారు. కోల్ కతా రెండో మ్యాచ్ లో విజృంభించింది. శార్దూల్ ఠాకుర్ 29 బంతుల్లో 68 పరుగులు చెలరేగిపోయాడు. ఆ తర్వాత బౌలింగ్ లోను స్పిన్ తో బెంగళూరును (royal challengers bangalore) చిత్తు చేసింది. గుర్బాజ్, రింకూ సింగ్ కూడా రాణించారు. అయితే బ్యాటింగ్ లైనప్ లో మూడో స్థానంలో వచ్చిన మన్ దీప్ ( Mandeep Singh) మాత్రం మరోసారి నిరాశపరిచాడు. గత సీజన్ లలోను అతను అంచనాలకు తగినట్లు రాణించలేదు. దీంతో గవాస్కర్ మండిపడ్డారు. అతను ప్రతిసారి ఏదో ఒక ప్రాంచైజీని వెతుక్కుంటాడని, కానీ ఆటలో రాణించలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. ఈ మ్యాచ్ లో మన్ దీప్ ఏకంగా డకౌట్ అయ్యారు. తొలి మ్యాచ్ లో ఓపెనర్ గా రెండు పరుగులు చేశారు.
మరోవైపు కేకేఆర్ యువ స్పిన్నర్లు సుయాశ్ శర్మ పైన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లియర్స్ ప్రశంసలు కురిపించారు. సుయాశ్ గురించి గతంలో తనకు తెలియదని, కానీ గురువారం నాటి మ్యాచ్ లో అతని బౌలింగ్ తనను ఎంతగానో ఆకట్టుకున్నదని చెప్పారు. భవిష్యత్తులో అతను కూడా ఒత్తిడికి గురయ్యే సమయం వస్తుందని, దానిని అధిగమించి ఎలా రాణిస్తాడో చూడాలన్నారు. అతను నిజంగా మా ఆర్సీబీ ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెట్టాడని చెప్పారు.