Rohit Sharma Century: నాగ్‌పూర్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌లో రోహిత్ అద్భుతగా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో మూడు ఫార్మాట్లు అయిన వన్డే, టెస్ట్, టీ20లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.
నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌లో రోహిత్ అద్భుతగా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) సెంచరీ చేయడంతో మూడు ఫార్మాట్లు అయిన వన్డే, టెస్ట్, టీ20లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ టీ బ్రేక్ తర్వాత ఆసీస్ ఆటగాడు కమ్మిన్స్ వేసిన బంతికి ఔట్ అయ్యాడు. దీంతో 212 బంతుల్లో రోహిత్ శర్మ 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేశాడు.
రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్టుల్లో సెంచరీ చేయడంతో మూడు ఫార్మట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుకెక్కాడు. ప్రపంచ క్రికెట్లో కేవలం నలుగురు మాత్రమే ఈ రికార్డును సాధించారు. అందులో రోహిత్ శర్మ కంటే ముందుగా బాబర్ ఆజాం, దిల్హాన్, ఫాఫ్ డుప్లెసిస్ వంటివారు ఉన్నారు. నాగ్‌పూర్ టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు ఆస్ట్రేలియా టీమ్ 177 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ ఆడుతోంది. భారత్ తరపున రెండో రోజు శుక్రవారం రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) సెంచరీ చేయడంతో డ్రెస్సింగ్ రూమ్ అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.
రోహిత్ శర్మ(Rohit Sharma) 2014లో డిసెంబర్ 9వ తేదిన ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకూ 14 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే 2985 రోజుల తర్వాత 15వ టెస్టు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు.
నాగ్‌పూర్ టెస్టు మ్యాచ్ జరగడానికి ముందు పిచ్ గురించి అందరూ చర్చించారు. పిచ్‌పై ఆస్ట్రేలియా మీడియా ఎప్పటికప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉండగా క్రికెట్ ప్రియులు సందేహం వ్యక్తం చేశారు. పిచ్ సహకరిస్తుందో లేదోననే భావనతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు పిచ్‌పై కాకుండా ఆటపై దృష్టి పెట్టాలని రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు సభ్యులకు సూచించాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శనను కనబరిచారు. తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీశాడు. అలాగే అశ్విన్ 450వ వికెట్ తీసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టులో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ చేశాడు.